ఇటలీనా ఇడ్లీనా?

ఈ వాక్యాలు ఇటలీ అనే దేశం గురించా, లేకపోతే ఇడ్లీ అనే ఆహారం గురించా?
Quiz by
thread
Rate:
Last updated: April 30, 2024
You have not attempted this quiz yet.
First submittedApril 24, 2024
Times taken17
Average score60.0%
Report this quizReport
4:00
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
1. అక్కడ రోమక నగరం ఉంటుంది
రోమకం ఇటలీ దేశ రాజధాని నగరం, కానీ ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇడ్లీలో రోమకం దొరకలేదు
ఇటలీ
ఇడ్లీ
రెండూ
2. ఎక్కువ మంది దీన్ని వండుతారు
ఇడ్లీ వండడం సరళమే, కానీ ఇటలీ వండాలంటే చాలా యుగాలు పట్టుతుంది, కాబట్టి ఎవ్వరూ దాన్ని వండరు
ఇటలీ
ఇడ్లీ
రెండూ
3. దీని చరిత్ర ఎక్కువ ప్రాచీనమైనది
ఇటలీ చరిత్ర రోమా సామ్రాజ్య కాలంలో ఉండింది, కానీ ఇడ్లీ చరిత్ర ౧౦వ శతాబ్దంలో మొదలైంది
ఇటలీ
ఇడ్లీ
రెండూ
4. రెండవ ప్రపంచ యుద్ధంలో నష్టపడింది
ఇటలీ ఓడిపోయిన ఆక్సిస్లో ఒక దేశం, కానీ యుద్ధకాలంలో బియ్యం లేకపోయినా ఇడ్లీ రవా ఇడ్లీ అయ్యి జీవించింది
ఇటలీ
ఇడ్లీ
రెండూ
5. ముక్కలు ముక్కలుగా విరిగుండచ్చు
ఇడ్లీ మెత్తగా ఉండడం వలన దాన్ని తేలికగా రెండుచెయ్యచ్చు, అదే విధంగా ౧౯వ శతాబ్దంలో ఇటలీ ఏకీకరణకు ముందు అది చాలా వేరే వేరే ముక్కలుగా ఉండేది
ఇటలీ
ఇడ్లీ
రెండూ
6. దీనికి దక్షిణ దిక్కు తో సంబంధముంది
ఇటలీ దక్షిణ ఐరోపాలో ఉంటుంది, ఇడ్లీ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తినే అహారం
ఇటలీ
ఇడ్లీ
రెండూ
7. ఇది ద్రవపదార్థం దగ్గర కనపిచ్చచ్చు
ఇటలీ మధ్యధరా సముద్రం పక్కనవుంటుంది, కాబట్టి అక్కడ చాలా ఊళ్ళల్లో ఆ పెద్ద ద్రవపదార్థం కనిపిస్తుంది, మరి ఇడ్లీ సాధారణంగా సాంబారనే ద్రవపదార్థం తో తింటారు
ఇటలీ
ఇడ్లీ
రెండూ
8. ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులు దాన్ని వర్ణిస్తాయి
ఇటలీ జెండాలో ఇవి కనిపిస్తాయి, మరి తెల్లటి ఇడ్లీని సామాన్యంగా ఎర్ర చట్నీ, ఆకుపచ్చ చట్నీ తో తింటారు
ఇటలీ
ఇడ్లీ
రెండూ
9. దాని ఆకారం కాలిజోడులాగుంటుంది
ఇటలీ బంతి తన్నుతున్న కాలిజోడు, కానీ దేవుడి దయవల్ల కాలిజోడు ఆకారంలో ఇడ్లీ ఉండదు
ఇటలీ
ఇడ్లీ
రెండూ
10. ఇది చాలా వంటకాలకు మూలం
పిజ్జా, పాస్తా ఇతర ప్రసిద్ధమైన ఆహారాలు ఇటలీ నుండి వస్తాయి, అలాగే రవా ఇడ్లీ, రాగీ ఇడ్లీ లాంటి ఆహారాలు ఇడ్లీ నుండి వస్తాయి
ఇటలీ
ఇడ్లీ
రెండూ
11. మార్చి ౩౦న దాని పండుగ
ఇటలీ పండుగలు చాలా ఉన్నాయి, కానీ మార్చి ౩౦ ఏమో ప్రపంచ ఇడ్లీ దినోత్సవం
ఇటలీ
ఇడ్లీ
రెండూ
12. ఒక పెద్ద సామ్రాజ్యానికి మూలం
రోమక నగరంలో రోమా సామ్రాజ్యం మొదలైంది, కానీ దురదృష్టంగా ఇడ్లీవలన మొదలైన సామ్రాజ్యాలు ఏవీ లేవు
ఇటలీ
ఇడ్లీ
రెండూ
13. నరేంద్ర మోదీ కోసం ప్రచారం చేస్తుంది
తమిళనాడులో సేలంలో మోదీ ఇడ్లీలని అమ్ముతారు, ఇంకా ఇటలీ నాయకురాలు జార్జియా మెలోనీ మోదీని పొగిడింది
ఇటలీ
ఇడ్లీ
రెండూ
14. దాని పిండి తో దోసెలు కూడా చెయ్యచ్చు
ఇడ్లీ పిండి తో దోసెలు చెయ్యచ్చు, కానీ ఇటలీ పిండి తో చేస్తే రుచి బాగుంటుందనుకోను
ఇటలీ
ఇడ్లీ
రెండూ
15. దీన్ని మామూలుగా పొద్దున తింటారు
ఇడ్లీ ప్రాతఃకాల భోజనంగా ప్రసిద్ధమైనది, కానీ ఇటలీ మామూలుగా ఫిబ్రవరి ౩౧న పదమూడింటికి తింటాం
ఇటలీ
ఇడ్లీ
రెండూ
Save Your Stats
Your Next Quiz
Name all 50 states in the USA. Easy, right?
Can you name the countries with the most heavy metal bands, both in total and per capita?
Drag the flag onto the correct state. Careful, though! One wrong move and the game ends.
Drag the pin onto the correct country. Careful, though! Three wrong moves and the game ends.
4 Comments
+3
Level 72
Apr 26, 2024
Epic stuff!
+1
Level 68
Apr 27, 2024
nenu rendu thinta
+2
Level 79
Apr 28, 2024
adi ni samasya
+1
Level 68
Sep 12, 2024
italian aharam chala baguntundi, vellina