820 కోట్ల మందికి సన్న బంగాళాదుంప వేపుడు వండటం

+5

820 కోట్ల మందికి సన్న బంగాళాదుంప వేపుడు వండటం

సన్న బంగాళాదుంప వేపుడు ఒక సాటిలేని వంటకం (బిర్యానీ దాని సాటి, ఏమో). ఈ వంటకాన్ని అందరు ఓ నాడు తినాల్సిందే. అందరు అంటే అందరు. ఈ గోప్ప పని చెయ్యదానికి ఇది చదవండి.

ఈ వ్యాసము చేస్తున్నప్పుడు నాకు తెలిసినది ఏమిటంటే ఎవరు సన్న బంగాళాదుంప వేపుడు చెయ్యరు. బంగాళాదుంప వేపుడు చేస్తారు కానీ అంత మంది సన్నగా కొయ్యారు. మీరు ఎప్పుడైనా బంగాళాదుంప వేపుడు చేస్తుండే, లేదా మీకు తెలిసినోళ్లు చేస్తుంటే సన్నగా కొయ్యండి/కొయ్యమంది. చాల బాగుంటుంది అల.

చూడండి!: నా లెక్కలు తప్పైతే క్షమించండి. మీరు ఈ అద్భుతమైన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నసారికి ఈ ప్రపంచంలో జనాల్లా లెక్క మారితే అంశ సంఖ్యలను 820 కోట్లతో భాగించి కొత్త లెక్కతో గుణించండి.

కావాల్సిన అంశాలు 

4100 కోట్ల చిన్న బంగాళాదుంపలు

82.654609644 కోట్ల కిలోల బియ్యం

165.309219288 కోట్ల లీటరుల నీళ్లు

6.062573560 కోట్ల లీటరుల నూనె (ఏ రకమైన సరే)

252 లక్షల కిలోల ఉప్పు

4100 కోట్ల టీస్పూనుల ఆవాలు, జీలకర్ర, మినుములు. ఎక్కువ తక్కువ కావాలంటే ఈ సంఖ్యను మార్చండి. ఇక వేరే పప్పులు వాడచ్చు.

4100 కోట్ల టీస్పూనుల పసుపు, కారాలు (మీకు నచ్చినవంటి)

సూచనలు

బంగాళాదుంపలన్ని తోలు ఒలిచి కడగండి. మీ 20 కోట్ల వంటగాళ్లుతో మీ 4100 కోట్ల చిన్న బంగాళాదుంపలు సన్నగా కొయ్యండి.

పెనంలో నూనె వెయ్యండి.

4100 కోట్ల టీస్పూనుల ఆవాలు, జీలకర్ర, మినుములు వెయ్యండి.

కోసిన బంగాళాదుంపలు వెయ్యండి. కొంచం సేపు వండండి.

ఇప్పుడు, కావాల్సినంత పసుపు, కారాలు వెయ్యండి.

ఇప్పుడు, మీ 82.654609644 కోట్ల కిలోల బియ్యం కడగండి.

53 కోట్ల ఇంస్టాపాటుల్లో రెండు క్వార్ట్ల బియ్యం, నాలుగు క్వార్ట్ల మంచి నీళ్లు పెట్టి, "రైస్" ఆప్షన్ నొక్కండి.

అంతే!

ఖర్చు 

ఈ వంటకం వండడానికి ఇదంతా కావాలి:
మీరు (ఇది వండితే)

4100 కోట్ల చిన్న బంగాళాదుంపలు

82.654609644 కోట్ల కిలోల బియ్యం

165.309219288 కోట్ల లీటరుల నీళ్లు

6.062573560 కోట్ల లీటరుల నూనె (ఏ రకమైన సరే)

252 లక్షల కిలోల ఉప్పు

4100 కోట్ల టీస్పూనుల ఆవాలు, జీలకర్ర, మినుములు. ఎక్కువ తక్కువ కావాలంటే ఈ సంఖ్యను మార్చండి. ఇక వేరే పప్పులు వాడచ్చు.

4100 కోట్ల టీస్పూనుల పసుపు, కారాలు (మీకు నచ్చినవంటి)

20 కోట్ల వంటగాళ్లు

20 కోట్ల కత్తులు

410 కోట్ల హాట్ ప్లేట్స్ (పొయ్యిలు కంటే తక్కువ ఖర్చు అని)

53 కోట్ల ఇంస్టాపాటులు

ఈ సంఖ్యలు మీరు సంయుక్త రాష్ట్రాలలో చేస్తున్నావంటే

$13,529,999,983.10 (బంగాళాదుంపలు)

$3,785,581,121.70 (బియ్యం)

$4,367,007.57 (నీళ్లు)

$159,835,937.00 (కనోల నూనె)

$57,094,977.50 (ఉప్పు)

ఆవాలు, జీలకర్ర, మినుములు, పసుపు, కారాలు, అంత ఎలా లెక్క పెట్టాలో నాకు తెలియదు. అందుకనే ఈ లెక్కలో పెట్టను.

20 కోట్ల వంటగాళ్లు x గంటకి $20 = $4,000,000,000.00

20 కోట్ల కత్తులు వంటగాళ్ళే తీసుకొస్తారు ($0.00)

$61,500,000,000 (తక్కువ అంచనా) (హాట్ ప్లేట్స్)

$37,094,700,000 (ఇంస్టాపాటులు)

ముగింపు

భవిష్యత్తులో  ఏదో గొప్పోడు ఇది చేస్తాడు

మీకు కనీసం $120,131,579,026.87 డాలర్లు ఉంటె, ఇది వండి లోకానికి మేలు చెయ్యచ్చు.

దయచేసి ఎవరో ఏర్పాట్లు చేసి, ఎదో కోటీశ్వరుడు నుండి డబ్బులు అడుక్కొని, వండండి!

తల $14.65 ఏ అనుకుంట! ఏదో మహానుభావుడు ఈ గొప్ప లక్ష్యాన్ని పూర్తించుతారు అని నాకు నమ్మకం.

- న్యోదిమము

35 Comments
+2
Level 70
Feb 21, 2025
ఇది ఏంటి? 💀 🥔
+2
Level 68
Feb 21, 2025
ఇలా మీరు 820 కోట్ల మందికి సన్న బంగాళాదుంప వేపుడు వండచ్చు!
+3
Level 79
Feb 21, 2025
ఆలుగడ్డ అని చెప్పు, పాపం వాడికి అర్ధం కాదు
+3
Level 70
Feb 21, 2025
అర్థం అయింది

గూఫీ ఆ బ్లాగ్

+1
Level 79
Feb 22, 2025
అంత గూఫీ కాదు. ఉద్దేశం గూఫీ కానీ తమాషా అంత లేదు. న్యోదిమం బ్లాగ్ల గూఫీతన శ్రేణీకరణలో ఇది అరటిపండు జవాబు కంటే ఎక్కువ గూఫీ కానీ శాంటా పేర్లు కంటే తక్కువ గూఫీ అని భావిస్తాను.
+1
Level 68
Feb 22, 2025
క్రిస్టమస్ తాత పేరులు గూఫీగా చెయ్యడం నా ఉద్దేశం కాదు. అది ఒక మావుల వ్యాసం.
+2
Level 79
Feb 22, 2025
తెలుసు, కానీ ఇది కూడా గూఫీ కాదు
+3
Level 65
Feb 21, 2025
Wish it was Zimbabwe dollars.
+2
Level 79
Feb 21, 2025
మంచి బ్లాగు న్యోదిమం! టెక్ససు కెనెడీ జిల్లాని తీసేస్తే దీని కోసం ఎక్కువ డబ్బులుంటాయని నా అభిప్రాయం.

అలాగే అడగాలనుకున్నాను, ప్రత్యోక్కరికి ఎంత తిండుండేటట్టు ఈ గణనం చేసావు?

"ఎక్కువ తక్కువ" ఏంట్రా వెధవ

+2
Level 68
Feb 21, 2025
ఎక్కువ తక్కువ కావాలంటే రా. ఈ సంఖ్యలు నేను మొన్న చేసిన సన్న బంగాళాదుంప వేపుడుతో చేసాను. ఒకడికి 5 బంగాళాదుంపలు.
+2
Level 79
Feb 22, 2025
ఓో సరే. నను ఇప్పుడే చూసా నువ్వు "బంగాళాదుంప" అనంటూ వచ్చావని. "బంగాళదుంప" అని మీరనరా?
+1
Level 68
Feb 22, 2025
బంగాళాదుంప
+2
Level 79
Feb 22, 2025
ఇంతెరెసాంతె, మేం బంగాళదుంప అంటాం
+1
Level 68
Feb 22, 2025
అది కాదప్పా, "బంగాళాదుంప" అనే లేఖిస్తారు. వాఙ్మయంలో వేరేగా వ్రాయడం తప్పు.
+2
Level 79
Feb 22, 2025
గూగ్లించరా, అందరు నాలాగే అంటారు.
+1
Level 68
Feb 22, 2025
నిఘంటువు వేరేగా చెప్పిందే? ఏమో
+1
Level 79
Feb 22, 2025
రోజూ వాడే మాటల గురించి నిఘంటువునీ గిఘంటువునీ అనుసరించక్కర్లే లే
+1
Level 68
Feb 22, 2025
నిఘంటువు వ్రాస్తున్నప్పుడు చూడలేదు. మీరు ప్రశ్నించిన్నప్పుడు చెక్ చేసా
+2
Level 79
Feb 22, 2025
ఆ సరే

వ్యుత్పత్తి చూస్తే నువ్వు చెప్పినట్టు బంగాళాదుంప సరిగ్గా అనిపిస్తుంది. సామాన్యమైన మాట కాబట్టి తొందర్గా చెప్తూ వస్తే నేను వాడే రూపం వచ్చింది కాబోలు

+1
Level 79
Feb 22, 2025
బ్రః ఐదు ముక్కలకు పద్నాలుగు బక్కులా? ఇదేమైనా పరాసు భోజనాలయమా
+1
Level 68
Feb 22, 2025
ఖర్చులో చాల శాతం హాట్ ప్లేట్లు. హాట్ ప్లేట్లను తీసేస్తే $7. ఇక 5 బంగాళాదుంపలు చాలా కాదు కానీ ఏమి తక్కువ కాదు.
+1
Level 79
Feb 22, 2025
ప్లేట్లెందుకు వెడిగావుండాలి, కూర వెడిగావుంటుందిగా
+1
Level 68
Feb 22, 2025
హాట్ ప్లేట్లంటే ఒక రకమైన పోయ్యి.
+1
Level 79
Feb 22, 2025
అలాగా

ఒక పెద్ద పొయ్యి వాడచ్చు గా

+1
Level 68
Feb 22, 2025
"(పొయ్యిలు కంటే తక్కువ ఖర్చు అని)"
+2
Level 79
Feb 22, 2025
ఒక పెద్ద హాట్ప్లేటు వాడచ్చా
+1
Level 68
Feb 22, 2025
మీరు కనిపెట్టి తరవాత కామెంట్లు వ్రాయండి
+1
Level 79
Feb 22, 2025
చాలా వేడి ప్లేటు వాడితే అదే సమయంలో అర హాట్ప్లేట్లు వాడి ప్రతిదానిలో వెళ్ళే బ్యాచులు రెట్టింపుజేయచ్చు
+2
Level 55
Feb 21, 2025
Do the number in Indian languages exceed from crore? Like you have written 4100 crore. Which would be written as 4.1 Arab in Urdu. And in Urdu there is kharab, neeel, sankh, mahasank after arab. Is it same in Telugu?
+1
Level 68
Feb 21, 2025
I've heard about those types of units, but they aren't used in Telugu and I've never seen them used in other languages either (or media). Didn't know Urdu actually uses them!
+2
Level 79
Feb 22, 2025
I know these from Sanskrit. I recall eka dasa sata sahasra ayuta laksa prayuta koti arbuda abja kharva nikharva mahapadma.

In practice some are left out and expressed with ten + the previous one ofc. AntiMatter found a list like this in Telugu a long time ago which was even longer but with some modifications and some exclusions due to the 10x practice. But none of them are really used in practice.

+1
Level 79
Feb 22, 2025
loka janasankhya nnc jainula sankhya tisesava?
+1
Level 68
Feb 22, 2025
world: 8,207,357,912

jains: 4-8 mil

~8.2 bil

+1
Level 63
Mar 9, 2025
small comment thread 💀
+1
Level 68
Mar 9, 2025
avunu challa cinna