బాతు, బత్తుత: బుడతకీచు ఋణపదాలు

+2

బుడతకీచు ఋణపదాలు

బుడతకీచు (పోర్చుగీస్) అనేది ఒక ఐరోపా భాష, ఇక కొన్ని బుడతకీచు పదాలు తెలుగులోకి వచ్చాయి. ప్రతిసారి తెలుగులో బుడతకీచు (పోర్చుగీస్) పదాల గురించి మాట్లాడిన, మనం సబ్బు, బాతు, ఇస్త్రీ చూస్తాము. కాని కొన్ని అంత తెలియని ఉన్నాయి. అయితే వాటిలో ఒక నకిలీ పదం ఉంది…

ఇవి

ఆసుపత్రి

చెవి (తాళం)

ఇస్త్రీ

సబ్బు

కమీజు

మేజా

లక్క

బాతు

ఇంకొన్ని ఉన్నాయి కానీ ఈ వ్యాసంలో వీటి గురించే మాట్లాడబోతున్నాము.

ఆసుపత్రి

అనుకున్న మూలం: బుడతకీచు హోస్పిటల్ లేదా ఎస్పిటల్ నుండి వచ్చింది

నా అభిప్రాయం: "ఆస్పత్రె", "ఆశుపత్రి", "ఆపత్తిరి", కర్ణాటకము, మలయాళము, అరవము లో ఉన్నాయి. కర్ణాటకము, మలయాళము ఇద్దరు బుడతకీచు నుండి వచ్చింది అని వ్రాసి ఉంది, కానీ అరవము (ఆపత్తిరి) ఆంగ్లం నుండి వచ్చింది అని ఉంది. అన్నిటిలో ఎందుకో "ర" ఉంది. ఈ పదం ఎపుడో నుండి తెలుగులో ఉంది కాబట్టి బుడతకీచు నుండి వచ్చింది అని ప్రకటిస్తున్నాను.

ఆసుపత్రి

ఇస్త్రీ

అనుకున్న మూలం: "ఎస్తిరార్" నుండి వచ్చింది, అంటే బుడతకీచులో "సాగతీయడం".

నా అభిప్రాయం: ఎ ఎందుకు ఇ అయ్యింది? ర ఎందుకు వత్తు అయ్యింది? మధ్యలో ఇ ఎందుకు చివరికి వెళ్ళింది? ఇది ఒక బుడతకీచు ఋణపదం.

ఇస్త్రీ పెట్టె

కమీజు

అనుకున్న మూలం:  "కమిజ" నుండి వచ్చింది, అంటే బుడతకీచులో "చొక్కా".

నా అభిప్రాయం: ఇది ఒక బుడతకీచు ఋణపదం.

కమీజు

లక్క

అనుకున్న మూలం:  బుడతకీచులో "లక" నుండి వచ్చింది. ఆ పదం పార్శి "లాక్" నుండి వచ్చింది. అది హిందీ "లాఖ్" నుండి వచ్చింది. చివరిగా ఈ పదం సంస్కృతంలో "లాక్ష" నుండి వచ్చింది.

నా అభిప్రాయం: ఈ పదం మొత్తం దునియా చుట్టూ తిరిగే బదులుగా, సంస్కృతం నుండి రాలేదు ఎందుకు?

లక్క

చెవి (తాళం)

అనుకున్న మూలం:  బుడతకీచులో "చవి/చవీ" నుండి వచ్చింది.

నా అభిప్రాయం: ఇది ఒక బుడతకీచు ఋణపదం.

లక్క

సబ్బు

అనుకున్న మూలం:  ప్రపంచంలో చాలా భాషలలో సబ్బు అన్న పదానికి ఒకే మూలం ఉంది. 

ఓకినావా భాషలో "సఫున్"

యూదియాలో "జెయ్ఫ్"

ఎస్తోనోనియ భాషలో "సేప్" 

స్వాజీలో, జూలూలో 'ఇంసిఫో"

ఫిన్నిష్ లో "సైప్పువ"

ల్యాటిన్ లో "సాపో"

ఆంగ్లంలో "సోప్"

మేయోరిలో "హోపి"

స్పనంలో "ఖబోన్"

జపాన్ లో "షాబోన్"

టగాలోగ్ లో "సబొన్"

చివరిగా,  బుడతకీచులో "సబౌఁ". అందునుండి సబ్బు వచ్చింది

నా అభిప్రాయం: ఇది ఒక బుడతకీచు ఋణపదం.

సబ్బు

మేజా

అనుకున్న మూలం: ఇది బుడతకీచు "మేస" నుండి వచ్చింది. ఇది పార్శి "మేస్" తో సంబంధించినది కాదు. హిందీ ద్వారా ఆ పదం నుండి రావడానికి అవకాశం ఉంది, కానీ అది అసంభవం.

నా అభిప్రాయం: ఇది ఒక బుడతకీచు ఋణపదం, ఏమో

మేజా

బాతు

అనుకున్న మూలం: ఇది బుడతకీచు "పాటో" నుండి వచ్చింది. ఇది అరబ్బీ "బట్ట్" నుండి.

నా అభిప్రాయం: ఒక రోజు నేను ఇబ్న్ బత్తుత గురించి నేర్చుకున్న. ఇతను చాల దేశాలు చుసిన అన్వేషకుడు, (కానీ ఒక స్త్రీద్వేషి). అతను పేరు అర్ధం "బాతుపిల్ల కొడుకు". ఇది తెలిసి, బాటు గుర్తొచ్చింది. నేను అనుకున్నాను "పక్కనే ఉన్న ఉర్దూ నుండి ఋణం తీసుకోకుండా వాళ్ళ నుండి ఎందుకు?" ఇక ఉర్దూ పదం తెలుగు పదానికి ఎక్కువ పోలికలు ఉన్నాయి (బత్తఖ్). అది పార్శి "బత్" నుండి. అందుకే నా అభిప్రాయంలో, "బాతు" అనే పదం పార్శీ ఋణపదము, ఇక ఇది ఒక బుడతకీచు ఋణపదము కాదు. మలయాళం, తమిళ్ భాషలలో ఈ జంతువు కోసం పేరు ఇలాగే వచ్చింది. ఇంకో చిన్న ముచ్చట: ఆ అరబ్బీ పార్శి పాదాలకు ఒకే మూలం ఉంది. అంటే చివరికి బుడతకీచు పదం తెలుగు పదానికి ఒకే మూలం ఉంది!

బాతు

ముగింపు 

ఈ వ్యాసము చాల రోజులు తర్వాత పూర్తించాను. చదివినందుకు ధన్యవాదాలు!

- న్యోదిమము

Comments
No comments yet