నూట నలభై నాలుగు ప్రజలు - భారత జనాభాశాస్త్రం

+5

వివరణ

ఇవాళ భారతదేశంలోని ప్రతి కోటి మంది జనాల్లో ఒక వ్యక్తిని ఒక గది లో బంధించాము. మన నూట నలభై నాలుగు బందీలు వ్యక్తులు ఎవరు? వారు వయసు ఎంత, భాష ఏమిటి, ఎక్కడ నుండి వచ్చారు? ఆ ప్రశ్నలకు ఈ వ్యాసం జవాబు ఇస్తుంది. మన వ్యక్తులు భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుండి వచ్చారు, అందుకే ఇది జనాభశాస్త్రంలో ఒక మంచి పరిశోధన. వీళ్లని చూస్తే, సాధారణ భారతీయుడు ఎలా ఉంటుంరో చూడవచ్చు.

సంఖ్యలు అన్నీ వేరే వేరే సంవత్సరాలు నుండి వచ్చాయి, +-౧౦%. నేను చెప్పిన సంఖ్యలు కంటే నిజం సంఖ్యలు పది శాతం వేరేగా ఉండవచ్చు.

కొన్ని సార్లు నేను చెప్పే సంఖ్యలను కల్పితే మొత్తం వంద శాతం అవ్వదు. క్షమించండి.

వయసు, లింగం

మన నూట నలభై నాలుగు వ్యక్తులులో ఆరు ఏళ్ళు కంటే చిన్న వ్యక్తులు పదహారు ఉన్నారు. వారులో ఎనిమిది మంది అబ్బాయిలు, ఎనిమిది మంది అమ్మాయిలు. దేశం మొత్తం చూస్తే, ఆరు ఏళ్ళు కంటే చిన్న వారులో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య తొమ్మిది శాతం ఎక్కువ. రెండు వ్యక్తులు ఈ సంవత్సరమే పుట్టారు. ౨౦౧౧ (2011) లో పదిహేనేళ్ళ కంటే చిన్న వారు పంతొమ్మిది అబ్బాయిలు, పద్దెనిమిది అమ్మాయిలు. డెబ్బై తొమ్మిది కంటే ఎక్కువ వయసున్న వారు అయిదు అబ్బాయిలు, ఆరు అమ్మాయిలు. పద్నాలుగు, ఎనభై మధ్య నలభై రెండు అబ్బాయిలు, నలభై అమ్మాయిలు. ౨౦౧౧ (2011) నుండి గడిచిన కాలంలో భారత జనాభా పెరిగింది, అలాగే సాధారణ వయసు పెరిగింది. అప్పుడు మన వ్యక్తుల వయసు సగటున ౨౪.౯ (24.9) ఉండేది, ఇప్పుడు మన గదిలో ౨౮.౨ (28.2).

లింగానికీ, వయసుకూ సంఖ్యలఅన్నీ 2011 నుండి వచ్చాయి. ఇప్పుడు డెబ్బై అయిదు అబ్బాయిలు, అరవై తొమ్మిది అమ్మాయిలు ఉన్నారు.

అప్పటి నుండి జనాభా పంతొమ్మిది శాతం పెరిగింది.

భయపెట్టిందా? భయపడకండి, ప్రతి సంవత్సరం తక్కువ మంది జన్మిస్తారు, మరి జనాభా పెరుగుదల తగ్గుతూ ఉంది. భారత జనాభా ప్రజనన సూచీ ౨.౧ (2.1) కంటే తక్కువ. అంటే సగటున ఒక స్త్రీ ౨.౧ (2.1) కంటే తక్కువ పిల్లలు కంటుంది. నాన్నను భర్తీ చేయడానికి ఒక పిల్ల, ఇంకోటి అమ్మకోసం, అలాగే ౦.౧ (0.1) చనిపోయిన వారుకు. ఇది ఎందుకు ముఖ్యం అంటే, ౨.౧ (2.1) కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. తక్కువ ఉంటే కొన్ని సంవత్సరాల తరువాత పెరుగుదల ఆగిపోతుంది. ఈ ప్రజనన సూచీ ఉత్తర భారతదేశంలో ఇంకా చాలా ఎక్కువ. అభివృద్ధి జరగడం, స్త్రీలకు విద్య రావడం, పట్టణీకరణం జరగడం, వ్యవసాయం రంగం కంటే పరిశ్రమ, సేవ రంగాల్లులో ఉద్యోగాలు రావడం, ఆరోగ్య సంరక్షణ బాగుండడం, ఇలా చాలా కారణాలవలన ప్రజనన సూచీ తగ్గుతుంది. 

ప్రతి జిల్లాలో ప్రజనన సూచీ

ఇది భారత జనాభా గోపురం. ముసలివారు పైన ఉన్నారు (అందుకే అక్కడ చిన్నగా ఉంది, ఎందుకంటే మరణంవలన కొంతమందే ఆ వయసుకు వస్తారు), మరి కింద పిల్లలు ఉంటారు. పిల్లల రేఖలు ప్రతి సంవత్సరం ఇంకా చిన్నగా అవ్వుతాయి, ఎందుకంటే ప్రతి సంవత్సరం తక్కువ పిల్లలు పుట్టుతున్నారు. రేఖలో ముదురు నీలంగా ఉంటే ఆ వయసులో ఎక్కువ అబ్బాయిలు ఉన్నారు. పై భాగంలో ముదురు ఎఱ్ఱగా కనిపిస్తుంది, ఎందుకంటే స్త్రీలు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు, మరి ఆ వయసులో స్త్రీలు ఎక్కువ ఉంటారు.

భారత జనాభా గోపురం

భాషలు

ఈ వ్యాసం విషయం ఏమిటో మర్చిపోయారా? క్షమించండి. ఇప్పుడు మన నూట నలభై నాలుగు వ్యక్తుల భాషలు చూద్దాం.

మాతృభాషలు:

ముప్పై ఎనిమిది (౩౮) వ్యక్తులకు హిందీ మాతృభాష.

పన్నెండు (౧౨) వ్యక్తులకు వంగభాష మాతృభాష.

పది (౧౦) వ్యక్తులకు మరాఠీ మాతృభాష.

పది (౧౦) వ్యక్తులకు తెలుగు మాతృభాష.

ఎనిమిది (౮) వ్యక్తులకు అరవం మాతృభాష.

ఏడు (౭) వ్యక్తులకు గుజరాతీ మాతృభాష.

ఆరు (౬) వ్యక్తులకు ఉర్దూ మాతృభాష.

అయిదు (౫) వ్యక్తులకు కర్ణాటం మాతృభాష.

నాలుగు (౪) వ్యక్తులకు ఓఢ్రం మాతృభాష.

నాలుగు (౪) వ్యక్తులకు మలయాళం మాతృభాష.

నాలుగు (౪) వ్యక్తులకు పంజాబీ మాతృభాష.

రెండు (౨) వ్యక్తులకు అసోమీ మాతృభాష.

రెండు (౨) వ్యక్తులకు మణిపురి మాతృభాష.

ఒక (౧) వ్యక్తికి భీలీ మాతృభాష.

ఒక (౧) వ్యక్తికి సంతాలి మాతృభాష.

ఒక (౧) వ్యక్తికి కాశ్మీరీ మాతృభాష.

ఇరవై తొమ్మిది (౨౯) వ్యక్తులకు వేరే భాష మాతృభాష. ఇవి చిన్నవి కానీ కొన్నిటికి రాష్ట్రాలు ఉన్నాయి.

౨౦౧౧ (2011) లో ౨౬ (26) శాతం భారతీయులు ద్విభాషి వారు, ౭ (7) త్రిభాషి వారు.

రెండవ మూడవ భాషలు కలిపి:

ఇరవై వ్యక్తులకు హిందీ మాతృభాష కాదు, కానీ తెలుసు (హిందీ మాట్లాడే భారతీయులులో వీరు ముప్పై నాలుగు శాతం)

పదిహేను వ్యక్తులకు ఆంగ్లం మాతృభాష కాదు, కానీ తెలుసు (దాదాపు అన్ని భారతీయులకు ఇది మాతృభాష కాదు)

రెండు వ్యక్తులకు మరాఠీ మాతృభాష కాదు, కానీ తెలుసు

రెండు వ్యక్తులకు కర్ణాటం మాతృభాష కాదు, కానీ తెలుసు (కర్ణాటం మాట్లాడే భారతీయులులో వీరు ఇరవై ఆరు శాతం)

ఒక వ్యక్తికి తెలుగు మాతృభాష కాదు, కానీ తెలుసు

ఒక వ్యక్తికి ఉర్దూ మాతృభాష కాదు, కానీ తెలుసు (ఉర్దూ మాట్లాడే భారతీయులులో వీరు పంతొమ్మిది శాతం)

ఒక వ్యక్తికి వంగభాష మాతృభాష కాదు, కానీ తెలుసు

ఒక వ్యక్తికి అసోమీ మాతృభాష కాదు, కానీ తెలుసు (అసోమీ మాట్లాడే భారతీయులులో వీరు ముప్పై అయిదు శాతం)

ఒక వ్యక్తికి అరవం మాతృభాష కాదు, కానీ తెలుసు

ఒక వ్యక్తికి ఓఢ్రం మాతృభాష కాదు, కానీ తెలుసు

ఒక వ్యక్తికి వేరే భాష మాతృభాష కాదు, కానీ తెలుసు

ఇరవై రెండు వ్యక్తుల మాతృభాషను జనాభా గణన హిందీలోకి కలిపేసింది.

నూట పన్నెండు వ్యక్తులు ఒక భారత-ఐరోపా భాష మాట్లాడుతారు.

ఇరవై ఎనిమిది వ్యక్తలు ఒక ద్రావిడ భాష మాట్లాడుతారు. వారులో ఇరవై ఆరు ఒక పెద్ద భాష మాట్లాడుతారు.

నాలుగు వ్యక్తులు వేరే భాష కుటంబానికి చెందిన భాష మాట్లాడుతారు.

కులం

నిజం విషయాలు గురించే నేను వ్రాస్తాను.

స్థానం

కొన్ని సంఖ్యలు అంచనాలు/బాహ్యానిక్షేపాలు.

ముప్పై ఆరు వ్యక్తులు మధ్య భారతదేశం నుండి వచ్చారు.

ముప్పై రెండు వ్యక్తులు తూర్పు భారతదేశం నుండి వచ్చారు.

ముప్పై వ్యక్తులు దక్షిణ భారతదేశం నుండి వచ్చారు.

ఇరవై ఒక వ్యక్తులు పడమర భారతదేశం నుండి వచ్చారు. 

పద్దెనిమిది వ్యక్తులు ఉత్తర భారతదేశం నుండి వచ్చారు.
అయిదు వ్యక్తులు ఈశాన్య భారతదేశం నుండి వచ్చారు.

ఇరవై ఆరు మంది ఉత్తర ప్రదేశ్ వారు.

పదమూడు మంది మహారాష్ట్ర వారు.

పదమూడు మంది బీహార్ వారు.

పది మంది పశ్చిమ బెంగాల్ వారు.

ముప్పై రెండు మంది కేంద్రపాలిత ప్రాంతాలు నుండి వచ్చారు.

యాభై మూడు వ్యక్తులు పట్టణాలు, నగరాలలో ఉంటారు. తొంభై ఒక వ్యక్తులు పల్లెటూరుల్లో, లేదా గ్రామీణ ప్రాంతాలలో ఉంటారు.

దేశాలు వివాదిస్తున్న భూమిలో ఒక వ్యక్తి ఉన్నాడు (దావా వేయకుండా నిర్ణయించిన భూమి, లేదా నిర్ణయించకుండా దావా వేసిన భూమి).

మతం

నూట పదిహేను హిందూ వ్యక్తులు ఉన్నారు.

సోమనాథ్ దేవాలయం, వెరావల్
శ్రీ వేంకటేశ్వర ఆలయం, తిరుమల
కైలాస దేవాలయం, ఎల్లోరా
ఆంగ్కోరు వాటు, కాంభోజ రాజ్యం (అతిపెద్దది, బౌద్ధ దేవాలయం అయ్యింది)

ఇరవై ముస్లిం వ్యక్తులు ఉన్నారు.

నసిర్-ఉల్-మోల్క్ మసీదు (గులాబీ మసీదు), పారశీకం
జామా మస్జిద్, ఢిల్లీ
మస్జిద్-ఉల్-హరామ్, మక్కా
షేక్ జాయిద్ మహా మసీదు, అబు దాబి

ముగ్గురు క్రైస్తవ వ్యక్తులు ఉన్నారు.

పీటర్ ముని వాళ్ళ చర్చి, వాటికన్ నగరం, రోమా
నోట్రే డాం, పారిసు
ఆయసోఫ్య, ఇస్తాంబుల్/కోస్తంటీనీయె, తురుష్కం (ఇప్పుడు మసీదు అయ్యింది)
బేసిల్ ముని వాళ్ళ మహాచర్చి

ఇద్దరు సిక్కు వ్యక్తులు ఉన్నారు

హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం), అమృత్‌సర్
అకాల్ తఖ్త్, అమృత్‌సర్
తఖ్త్ శ్రీ పటనా సాహిబ్, పట్నా
గురుద్వారా జన్మ స్థానం, నాన్కాన సాహిబ్, పాకిస్తాన్

ఒక వ్యక్తి బౌద్ధుడు.

బోధి వృక్షం, గయ
మాయా దేవి ఆలయం, లుంబిని
ధమేఖ్ స్థూపం, సారనాథ్
కుతోడ పగోడా, మన్తలే, బ్రహ్మదేశం

ఒక వ్యక్తి జైనుడు.

శిఖర్జి, పరస్నాథ్ పర్వతం
పాలిటానా ఆలయ సముదాయం, పాలిటానా
గిర్నార్ దేవాలయాలు, జునాగఢ్
ఒడేగల్ బసది వెనుకాలా గోమటేశ్వర విగ్రహం, వింధ్యగిరి కొండ 

ఇద్దరు వ్యక్తులకు మతం లేదు, లేదా వేరే మతానికి చెందినవారు.

మతంలో నమ్మకాలు, ఆచరణలు.

ఈ విభాగంలోని సంఖ్యలను నేను ప్యూ రీసర్చ్ సెంటరు (ప్యూ పరిశోధన కేంద్రం) వారు సంఖ్యలతో చేసాను. అందు కోసం కృతజ్ఞలం.

చూడండి! ఈ సంఖ్యలు పెద్దలే కోసం ఉన్నాయి, కానీ నేను అన్ని వ్యక్తలకు లెక్కించాను. పెద్దవారు చేసేది చిన్నవారు కూడా కాస్త చేస్తారు. అందుకే అల్లాగే పెట్టాను. డబ్బులు ఇస్తారు అని పెట్టాను. చిన్నవారు డబ్బులు ఇవ్వరు కదా? కానీ వారు కుటంబాలు ఇస్తాయి, అందుకే ఇదంతా పనిచేస్తుంది.

ఇంకా చుడండి! నేను ప్రార్థనాలయం అంటే మందిరం, చర్చి, మసీదు, అన్ని గురించి మాట్లాడుతున్నాను. 

నూట ఇరవై వ్యక్తులు వారు జీవితాలలో వారు మతం "చాల ముఖ్యం" అన్నారు.

డెబ్బై అయిదు వారు వారానికి ఒక సారైనా వారు ప్రార్థనాలయానికి వెళ్ళ్తారు.

ముప్పై ఆరు వ్యక్తులు సంవత్సరంలో ఒకటో రెండో సార్లు వెళ్ళ్తారు.

ఏడు వ్యక్తులు ఎప్పుడూ వెళ్ళరు.

నూట ఇరవై ఎనిమిది వ్యక్తులు వారు ప్రార్థనాలయానికి డబ్బుల దానం చేస్తారు.

ఎనభై ఆరు వ్యక్తులు రోజూ పూజిస్తారు.

నూట ఇరవై ఒక వ్యక్తులు వారు గ్రంథం దేవుడు మాట అని నమ్ముతారు.

నూట పదిహేడు వ్యక్తులకు వారు మతం చిహ్నం లేదా విగ్రహం వారు గృహంలో ఉంది.

ఎనభై ఒక వ్యక్తులు తీర్థయాత్రకు వెళ్లారు.

నూట ఇరవై వ్యక్తులు వాళ్ళ సంఘటన ఏర్పాట్లు చేస్తున్నప్పుడు వాళ్ళ మతంలో శుభమైన రోజులు చూసుకొని సంఘటన చేసారు.

యాభై ఆరు మంది శాకాహారులు.

ఇరవై ఆరు మంది ప్రజలు ఎప్పుడైనా మాంసం తింటారు, అన్ని మాంసాలను తింటారు

నూట పది మంది కర్మన్ని నమ్ముతారు.

యాభై అయిదు మంది పునర్జన్మలును నమ్ముతారు.

యాభై నాలుగు వ్యక్తులు కంటే ఎక్కువ మంది మోక్షాన్ని నమ్ముతారు. కైవల్యము, నిర్వాణము కల్పితే కచ్చితంగా ఎక్కువ ఉంటారు.

నూట ఒక వ్యక్తులు విధిని నమ్ముతారు. అరవై మూడు వ్యక్తులు జ్యోతిశాస్త్రాన్ని నమ్ముతారు.

డెబ్బై ఒక వ్యక్తులు కుదృష్టిని/చెడు చూపుని నమ్ముతారు.

ఎనభై ఆరు వ్యక్తులు ఆయుర్వేదం లేదా ఇంటిలో చేసిన చికిత్సలు నమ్ముతారు

నూట నలభై మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు.

యాభై మంది ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడని నమ్ముతారు

చాల రూపాలు తో ఉన్న ఒక దేవుడు ఉన్నాడని ఎనభై అయిదు వ్యక్తులు నమ్ముతారు.

ఒక దేవుడు కంటే ఎక్కువ దేవుడులు ఉన్నారని తొమ్మిది మంది నమ్ముతారు.

ఎనభై తొమ్మిది వ్యక్తులు దేవుడు మానవ రూపంలో రావచ్చు అని నమ్ముతారు.

ధనం

ఈ విభాగంలో కొన్ని సంఖ్యలను నేను ఔర్ వరల్డ్ ఇన్ డేటా వారు సంఖ్యలతో చేసాను. అందు కోసం కృతజ్ఞలం.

ఈ విభాగంలో రూపాయి సంఖ్యలు జనవరి ౨౦౨౫ (2025) లో వ్రాసాను, జనవరి మారకపు సూచీలు వాడాను.

రోజు ఒక డాలర్ కంటే తక్కువ డబ్బు ఒక వ్యక్తీ సంపాదిస్తున్నాడు. (౮౬.౧౮ (86.18) రూపాయలు)

పద్దెనిమిది వ్యక్తులు తీవ్రమైన పేదరికంలో బతుకుతున్నారు. రోజుకి ౨.౧౫ (2.15) డాలర్లు, అంతర్జాతీయ పేదరిక రేఖ) (౧౮౫.౩౦ (185.30) రూపాయలు)

రోజు ౩.౬౫ (3.65) డాలర్లు కంటే తక్కువ అరవై రెండు వ్యక్తులు సంపాదిస్తున్నారు. (కింది మధ్య ఆదాయ పేదరిక రేఖ) (౩౧౪.౫౭ (314.57) రూపాయలు)

రోజు ౬.౮౫ (6.85) డాలర్లు కంటే తక్కువ నూట పదిహేను వ్యక్తులు సంపాదిస్తున్నారు. (మీది మధ్య ఆదాయ పేదరిక రేఖ) (౫౯౦.౩౭ (590.37) రూపాయలు)

రోజు పది డాలర్లు కంటే ఎక్కువ పదమూడు వ్యక్తులు సంపాదిస్తున్నారు. (౮౬౧.౮౫ (861.85) రూపాయలు)

రోజు ఇరవై డాలర్లు కంటే ఎక్కువ నాలుగు వ్యక్తులు సంపాదిస్తున్నారు. (౧౭౨౩.౭౦ (1723.70) రూపాయలు)

రోజు నలభై డాలర్లు కంటే ఎక్కువ మూడు వ్యక్తులు సంపాదిస్తున్నారు. (౩౪౪౭.౩౯ (3447.39) రూపాయలు)

2012

౨౦౧౩ (2013), ౨౦౨౩ (2023) మధ్య పాతిక వ్యక్తులు బహుమితీయ పేదరికం నుండి బయటపడ్డారు.

పదహారు వ్యక్తులు బహుమితీయ పేదరికంలో ఉన్నారు. భారతీయ బహుమితీయ పేదరిక సూచీ ౧౧.౨౮ (11.28) శాతం.

గోవాకి అతితక్కువ బహుమితీయ సూచీ ఉంది (౦.౩౭% (0.37%)).

బీహారుకి అత్యంత బహుమితీయ సూచీ ఉంది (౨౬.౫౯% (26.59%)).

ముగింపు

భారతదేశంలో రకరకాల మనుషులుంటారు. ఈ వ్యాసం మీకు ఈ దేశంలో ప్రజలు గురించి, ఒక తేలిక విధానంలో నేర్పింది అని ఆశిస్తున్నాను!

- న్యోదిమము

2 Comments
+2
Level 79
Jan 26, 2025
నేను ఈ వ్యాసాన్ని ఇదివరకు చదివాను!
+2
Level 66
Jan 27, 2025
Telugu starting to step up?