మాకియవెల్లి సూత్రాలు

+2

విషయానికి ఉపోద్ఘాతం

మనందరం మంచివాళ్లుగా ఉండాలని కోరుకుంటాము... కనీసం మనము అదే నమ్ముతాము. 2020 దశాబ్ధ ఆరంభంలో, 2000 అమెరికన్ నివాసితులతో ఆంగ్లదేశ సంస్థ వన్పోల్ ఒక సర్వేక్షణ నిర్వహించింది. వచ్చిన ఫలితాలు ప్రకారం, పాల్గొనవళ్లలో 81% మానవజాతి సహజంగానే మంచిదనే ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది. యుద్ధభూమి చుసిన ప్రతి సైనికుడు, అమెరికన్ సైకో చుసిన ప్రతి సినిపిచ్చోడు, వీళ్ళ మాట నిజమని నమ్మరు. సందీప్ రెడ్డి వంగాకు ఇది నువ్వు చెప్పితే, నవ్వి వెళ్లిపోయేటప్పుడు అరచేతిలో గోలీలు పెడుతాడు.

మన జీవితాలు చాలా చిన్నవి, కానీ ఈ "కౄరమైన" ప్రపంచంలో, ఇతరులను ప్రశాంతంగా జీవించనివ్వని వారు ఉంటారు. మోసగాళ్లు, దొంగలు, హంతకులు, దహనకారులు, తీవ్రవాదులు, దేశద్రోహులు, విధ్వంసకులు, స్కామర్లు, బెదరించేవాళ్ళు. మోసగాళ్లు, దొంగలు, హంతకులు, దహనకారులు, తీవ్రవాదులు, దేశద్రోహులు, విధ్వంసకులు, స్కామర్లు, బెదరించేవాళ్ళు. హిట్ 3 సినిమాలో, అర్జున్ సర్కార్ నేరస్తులు గురించి ఒకటి చెప్తారు. "సర్, క్రిమినల్స్. ఉంటె భూమి మీద టెన్ ఫుట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో సిక్స్ ఫీట్ హోల్లో ఉండాలి." మన జీవితాలలో కూడా చాల మంది మన నిశ్చిత జీవితాలను చెడగొడుతారు; ఆస్తులు కోసము కుటుంబ సభ్యులు, కొత్త వ్యాపారాలను అభివృద్ధి అవనివ్వకుండా ఉండాలని అనుకున్న వాళ్ళు, ఉద్యోగంలో రాజకీయాలు; అంధకారమైన రాత్రులుపై సరిగా నిద్రపోవడానికి అవకాశం లేకుండా ఇలాంటివి ఎన్నో వ్యక్తులు ఉన్నారు వస్తారు. జాలి, దయ, కరుణ లేని మనుషులు ఉన్నట్టు అనిపిస్తది ఈ గ్రహముపైన.

మీ జీవితంలో కొన్నిసార్లు, మీరిప్పుడు ప్రస్తుతం ఉన్న చోట కంటే నరకంలో జీవించడానికి మంచి ప్రదేశంగా ఉండే సందర్భాలు ఉంటాయి. ఒక్కోసారి మిమల్ని హింసపెట్టినోళ్లను "నువ్వు నరకం అనుభవిస్తావు!" అని మీరు శపించిన, తిరిగి "నేను ఎక్కడుంచి వచ్చావని అనుకున్నావు" అంటారు. ఇది పైశాచిక ఆనందమా, లేకపోతే వాళ్ళు పుట్టినప్పుడు అసురల మధ్య పెరిగాడా మనకు అర్ధం కాదు. కానీ... ఇది నేను మీకు చికిత్స అందించే బ్లాగ్ కాదు. అట్లాంటి పరిష్కారం మీరు కోరుతున్నారంటే, దయచేసి మీరు వెళ్లిపోండి.  ఎందుకంటే "అంతా బాగానే ఉంటుంది", "అతిత్వరలో మీకు లాభం రావడం అనివార్యమైనది" అని నేను మీకు మాట ఇవ్వను. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట, నేను చెప్పను. (ఛత్రపతిని మీరు చూసుండకపోతే, మీకు నేను ముందే మాటిస్తునాను, దానిని తొలిసారి చూడడం అమృతం త్రాగడంతో సమానం.)

సూర్య భాయ్: పేరు కాదు. ఇట్స్ ఏ బ్రాండ్.

కాదు, ఇది ఒక సమాధానం. మీ సమస్యలకు నైతికంగా బూడిద-రంగు సమాధానం. బహుశా మీరు మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ చూసుంటే, సూర్య భాయ్ పాత్ర మీకు బాగా తెలిసే ఉంటది. అతను ప్రత్యేకత అతని బలం కాదు, అతని ఆభ్యుదయేచ్ఛ కాదు. అతని విలువలు. కానీ సామాజికంగా సరైనదని భావించే దాని కోసం కాదు, కానీ అతను సరైనదని నమ్మే దాని కోసం. అతన్ని విరోధిగా మార్చగల సందేహాస్పదమైన పనులు చేయడం మీరు చూశారు. కానీ మనము అతనితో ఏకీభవిస్తున్నాము. ఎందుకు? ఎందుకంటే, అతను జీవితంపై సమాజంపై ప్రమాణముపై, భిన్నమైన దృష్టికోణం మనకు చూపిస్తాడు. సూర్య తన చర్యలను సమర్థిస్తాడు, వివరిస్తాడు. అతను తన నమ్మకాలలో మార్పు తెచ్చుకోడు, మరియు తనను తాను ఇతరుల ఆశలు కన్నా తననే పైన పెట్టుకుంటాడు. అతని ప్రియురాలు కోసమని, అతను తన జీవిత విధానాన్ని అసలు మార్చుకోడు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అది అతని పూర్తి వ్యక్తిత్వాన్ని సంగ్రహిస్తుంది.

"యుద్ధం చేతకాని వాడే ధర్మం గురించి మాట్లాడుతాడు."   అలనాటి పూరి జగన్నాథ్ ను నేను మిస్ అవుతున్న. నిత్యం బాధ పడుతాను అతను గురించి తలుచుకుంటే.

ముగింపులు సాధనాలను సమర్థిస్తాయి. ఆ సినిమాలో అతని వ్యక్తిత్వాన్ని వివరించే వాక్యం ఏదైనా ఉంటే, అది ఇదే. మీరు ముంబై పాలించే రాజు కావాలని అనుకోకపోవచ్చు. కానీ కొన్ని విధానాలు అతని లాగా ఉండాలి మనమందరం కోరుకుంటాము. నిజం ఏమిటంటే, అతను చేసినదంతా మాకియవెల్లి సూత్రాలను అనుసరించడమే. అతనికి ఆ విషయం తెలియకపోవచ్చు, కానీ అతని చర్యలు మరియు ఉద్దేశ్యాలు వాటితో కలిసి ఉంటాయి.

నికోలో మాకియవెల్లి

నికోలో మాకియవెల్లి. అతను కరుణనే తన సొంత విరోధి గా ఎలా తీసుకున్నాడో...

ఎవరు ఇతను అని మీకు అడగడానికి హక్కు వుంది. నాకు బాధ్యత ఉంది కాబట్టి, సమాధానం ఏమిటంటే అతను ఒక ఇటాలియన్త త్వవేత్త మరియు ఒక రాజనీతిజ్ఞుడు. 1513 లో, మాకియవెల్లి "ది ప్రిన్స్" అనే గ్రంథాన్ని రాశాడు, అది అతని మరణం తరువాత ప్రచురించబడింది. "ది ప్రిన్స్" ప్రచురణకు ముందు, ఆదర్శ నాయకుడిగా ఉండమని, నైతికంగా మరియు గౌరవప్రదంగా ఉండాలని సలహా ఇవ్వబడింది. మాకియవెల్లి వెర్షన్ ప్రకారం, ఒక రాజకుమారుడు వాస్తవికంగా ఉండటానికి బదులుగా, పరిపూర్ణంగా ఉండటంపై దృష్టి పెడితే, మీరు ప్రతిదీ కోల్పోతారు. పరిస్థితులు ఎలా ఉండాలో దాని ఆధారంగా మీ చర్యలను చేయకండి. వాస్తవానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో దాని ఆధారంగా ఆలోచించండి, లేకుంటే మీరు నాశనమవుతారు.

అతను ముందుగానే చెబుతాడు, అతనికి ఆదర్శ గణతంత్రాల గురించి లేదా ఈ ఊహాత్మక ఆదర్శధామాల గురించి మాట్లాడటంలో ఆసక్తి లేదు. అతని రాజకీయ వాస్తవికత బాగా తెలుస్తుంది, ఎందుకంటే అసలైన రాజకీయ, ప్రభావవంతమైన సత్యం గురించి మాత్రమే పలకరిస్తారు. తద్వారా అతని గ్రంథం పరిపాలనా సాధనలో ఆచరణాత్మకంగా ఉపయోగపడుతుంది. కానీ ఎప్పటిలాగే, ఏదీ కూడా అంత సులభం కాదుకదా. 'ది ప్రిన్స్' ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే ఈ గ్రంథం, ఈ ప్రపంచాన్ని ఒక దుర్నీతిగా వుండే దృష్టి నుంచి చుస్తే ఎలా ఉంటదని ప్రదర్శిస్తుంది. ఇక్కడ ఒక తెలిసిన కథ ప్రత్యక్షం అవుతుంది: మానవజాతి స్వభావం నీచమైనది, అందరు స్వార్థపరులు, మిమల్ని ద్రోహం చేయడానికి వెనకడుగు వెయ్యరు. చంపండి లేదా చంపబడండి; బలవంతుల మనుగడ. కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచం ఇకపై రాజ్యాలతో నిండి లేదు. బహుశా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' మీరు చూసుండొచ్చు. కానీ మీకు తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడికాలం శక్తి కోసం యుద్ధాలు నిశబ్ధంగా ఉంటాయి. పిశాచులు లాగా నెత్తురు కోసం మనుషులు వచ్చి అరవట్లేదు. భూమిని పాలించడానికి మహాయుద్ధాలు లేవు. మనం పోరాడటానికి మహా యుద్ధం లేదు, దాని బదులుగా మన మహా యుద్ధం మనతోనే. కానీ అతని నీతులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే సమాజంతో మనకున్న పోరాటాలు కార్పొరేట్ వృద్ధి, వ్యక్తిగత గుర్తింపు మరియు కుటుంబ కలహాల రూపంలో ఉంటాయి. ఎందుకంటే మనలో చాలా మంది కోరుకున్నది కొన్ని: మనుగడ, కారకత్వము, సౌకర్యం. ఈ కఠినమైన ప్రపంచంలో, బహుశా మనం ఎటువంటి లక్షణాలు సద్గుణమైనవని తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉంది. మచియవెల్లి వారి నీతులు మీకు ఈ విషయంలో సహకారం ఇవ్వచ్చు.

సూత్రాలు

'ది ప్రిన్స్' పదిహేడవ అధ్యాయంలో, మాకియవెల్లి ఒక యువరాజు ప్రేమించబడటం లేదా భయపడటం మంచిదా అనే ప్రశ్నను ప్రస్తావిస్తాడు. మానవులు దౌర్భాగ్య జీవులని, వారి స్వార్థ ప్రయోజనాల చట్టం ద్వారా మాత్రమే పరిపాలించబడతారని ఆయన అంటున్నారు. పాలకులకు ద్వేషం లేదా తృణీకరణ జరగకుండా చూసుకోవాలని మాకియవెల్లి సలహా ఇస్తున్నాడు. దాతృత్వాన్ని పొదుపుతో సమతుల్యం చేసుకోవాలని, అలాగే క్రూరత్వాన్ని తక్కువగా కానీ ప్రభావవంతంగా ఉపయోగించాలని ఆయన సూచిస్తున్నారు. ఉదాహరణగా ఒక రాజకుమారుడు లాభం ఉంటేనే మాట ఇవ్వాలి.

ప్రేమించబడటం కంటే భయపడటం యువరాజుకు మంచిది, ఎందుకంటే ప్రేమ చంచలమైనది, భయం స్థిరంగా ఉంటుంది. మీరు దీని నుంచి ఒకటి గమనించుచు. ఈ లోకం మంచితనాన్ని వ్యాపార-విషయాలలో, అధికారం-విషయాలలో ప్రతిఫలం ఇవ్వదు. ప్రేమ మంచిది, కానీ అది తాత్కాలికమైనది. భయం, బెదిరింపులు చాలా కాలం పాటు ఉంటాయి. అయినప్పటికీ, అది అత్యంత ఆదర్శవంతమైన పరిష్కారం కాదు, ఎందుకంటే మనము వీధులను పాలించే గ్యాంగ్‌స్టర్లము కాదు. మనం స్థిరత్వం, భద్రతను కోరుతాము, కానీ మీరు 'వోల్ఫ్ అఫ్ వాల్ స్ట్రీట్' లో జోర్డాన్ బెలీఫోర్ట్ లాంటి వ్యక్తిత్వం ఉంటె, మీకు పెరుగుదల, నియంత్రణ, స్థితి కూడా మీ ఆశయాలతో భాగమే.

ఒక పరిపూర్ణ ప్రపంచంలో, మీరు మచియవెల్లి చెప్పిన నీతులు ఆధారపడవలసిన అవసరం లేదు. కానీ ఇంతకన్నా మీ లక్ష్యం చేరుకోవడానికి వేగమైన మార్గం లేదు.

1) మీ పరిసరాలను విశ్లేషించండి. మీకు కళ్ళు ఉంటే మీ చుట్టూ వున్నా మనుషులు మీరు చూడగలరు. కానీ ఉపరితల స్థాయిలో కాదు, లోతైన స్థాయిలో. ప్రతివాడికి శశివదనం ఉండదు; లోపాలన బాధలు, ఆశయాలు ఉంటాయి. మీరు ప్రజల బలాలు, బలహీనతలు, ప్రేరణలు మరియు కోరికలను తెలుసుకోవాలి. వాటిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోండి.

2) ఫలితంను ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువ "నేను మంచి విధానంలో ప్రవర్తిస్తున్నానా" అని అడగామాకు. మీరు మహర్షి కాదు త్యాగరాజ కూడా కాదు. ఇది మీకు కావల్సినది తక్కడానికి అవకాశం ఇస్తే, తీసుకోండి. అది శారీరక హాని కలిగిస్తే తప్ప.

3) దీర్ఘాయువుపై దృష్టి పెట్టండి. అంటే ఏమిటి? ఎప్పుడుకూడా మూడు అడుగులు ఉండండి. అత్యధిక శాతం మనుషులు ఊహించదగిన చర్యలు చేస్తూటారు. వారి తదుపరి కదలికను ఊహించి, సరైన సమయంలో సమీకరణం నుండి వారిని తీసివేయండి.

4) సందర్భం బట్టి అనుకూలపరచండి. మీరు బ్రతుకులేని బూడిద కాదు. ఒకే విధానంలో ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఇది ఒక బలహీనత, ఎందుకంటే దాన్ని తీసుకొని మిమల్ని క్రిందకు దించడానికి మార్గం లాగా కనిపించుచు. మీ వ్యూహాన్ని మార్చుకోండి, కానీ చివరి లక్ష్యాన్ని అలాగే ఉంచండి.

5) ప్రజలు మిమ్మల్ని "మంచివాళ్ళు" అని అనుకోవడానికి ఇష్టపడతారు. అనవసరమైన శత్రువులను నివారించడానికి దాన్ని ఉపయోగించండి. మీరు వున్నా పరిశ్రమలో, నిజమైన స్నేహబంధాలు ఉండడం తప్పుకాదు. మాకియవెల్లి 24/7 గంటలు రాక్షసుడిగా ఉండమని చెప్పలేదు; నియమాలను ఉల్లంఘిస్తూ మనిషిలా కనిపించమని ఆయన అన్నారు.

ముగింపు

భావోద్వేగాలను ఒక బాధ్యతగా పరిగణించినప్పుడు ప్రజలు తీసుకునే మార్గంలో మాకియవెల్లి నైతికతలను ఉపయోగిస్తారు. కానీ అవి కావు. జీవితంలో మీ ఏకైక కల డబ్బులు స్థాయి మాత్రమైతే, మీ మీద నేను జాలి పడుతున్న. ఎందుకంటే అంతకన్నా ఆసక్తి లేని లక్ష్యం ఉండదు. డబ్బు సంతోషం కొనలేదు. కేవలం అది ఒక తాత్కాలిక పరిష్కారం. మీరు మీ నీతులును మార్చుకోమని నేను చెప్పలేదు, ఎందుకంటే నా వలన బాధ, అన్యాయం జరగాలని నేను కోరుకోవట్లేదు. నేను శ్రీరాముడు కర్చితంగా కాదు; అలాగే నేను చేసే ప్రతి పనిలో న్యాయం ధర్మం వుంది అని కూడా నేను చెప్పను. కానీ సంబంధాలు, స్నేహాలు ఇప్పటికీ ఒక వ్యక్తికి అత్యంత ముఖ్యమైనవి. డబ్బు మంచిదే. నా దగ్గర ఇప్పుడే కోట్లు కొద్దీ డబ్బు ఉంటే, నేను ఖచ్చితంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. కానీ ఒంటరితనం, సోమరితనం కన్నా ఏవి బాధ పెట్టలేవు (మీరు బెర్ముడా ట్రయాంగిల్ స్లం లో  నివాసం ఉంటేనే తప్ప, లేక మీ పూర్తీ కుటుంబం ఒక హంతకుడు వల్ల మరణిచిందంటే తప్ప, ఒక మనిషి దీని కన్నా బాధ పడటం కష్టం.)

చివరికి, అతి ముఖ్యమైన విషయం ఇది: ఎప్పుడూ మీ స్థానం నిలబెట్టుకోండి. మరొకరిని మీపై తొక్కదానికి అవకాశం మీరు ఇవ్వకండి. ఇక సెలవ తీసుకొంటే. వచ్చే శతాబ్దంలో నా నుంచి మీకు మల్లి వినిపిస్తది. అప్పడివరకు వీడ్కోలు.

5 Comments
+1
Level 68
Mar 5, 2026
సర్వేక్షణ అనే పదము సర్వే నుండి వచ్చిందా
+2
Level 68
Mar 5, 2026
అయ్ బాబోయ్ మీరు నిజంగా హిట్ ౩ నుండి కొటేషన్ పెట్టారా

మీ వల్లనా బాధ అన్యాయం జరగాలని లేదు అని చెప్తున్నారు, కానీ ఈ పాఠము శ్రద్దగా విన్నవాళ్ళు అవే రప్పిస్తారుగా? చెడ్డ నేర్పించడము చెడ్డది కాదా? మీరు నేర్పుతున్న సూత్రాలు లోకానికి శాంతి కలిగించవు. మీరు చెప్పిన మోసగాళ్లు, దొంగలు, హంతకులు, ఇత్యాది వ్యక్తులు, నీతి లేకే అవ్వన్నీ చేస్తుంటారు. నీతి పోతున్న కాలములో తగ్గించడములో ఏ మంచి వస్తుంది?

ఇదిగో, మీరు చెప్పినవాటిలో ఒక నిజాము ఉంది: మొదటిగా, చాల బాగా, కాస్త హాస్యముగా వ్రాసారు! సినిపిచ్చోడి గుర్తు బాగా కనిపిస్తుంది కూడా. చదవటం మధ్య చాట్జిపిటీ ఎలాగో "అవును! మీరు చేసిందంతా ఒప్పే! మీరు ఏ తప్పులు చెయ్యలేదు" అని అంటుందో, అదే గుర్తొచ్చింది హహహ. కానీ నిజంగా చెప్పాలంటే, ఎవరైనా దుర్మార్గులు పైకెళ్లాలనుకుంటే ఇది చదవాల్సిందే. రెండోది: ఇలా ప్రవర్తించడంతో లక్ష్యాలు ఎక్కువ త్వరణముతో సాధించగలరు. కానీ ఒక స్వార్థపరాయణ విధానములో ఆలోచిద్దాము: ఇలాగె అందరు ఉంటె, ఎవరు వాళ్ళ లక్ష్యాలు సాధించకలేకపోతారు. అంతేకాక, మీరు ఫిర్యాదుచేసినవన్నీ రకాల జనాలు (దొంగలు, మోసగాళ్లు) పెరుగుతారు. అంటే అందరి జీవితాలు బాగోవు. ఇలాంటి

+1
Level 68
Mar 5, 2026
ఆలోచనలతోనే ఈ దునియా కల్కి 2892 స్పీడ్-రన్ చేస్తున్నట్లుంది.

బ్లాగ్ బాగుంది!

+2
Level 63
Mar 6, 2026
జ్యాదా ధన్యవాదాలు!
+2
Level 63
Mar 6, 2026
దీని వలన నేను ప్రపంచానికి శాంతం తేవాలని ఉద్దేశంతో చేయలేదు. అందరు ఈ నీతులు పాటించమని కూడా ఆదేశించట్లేదు. అందికే నేను ముగింపుతోనే చెప్పను, ఇవ్వని పాటించడం వలన మనుషులు నైతికంగా అలసిపోతారు. ఇది వేగం యొక్క లోపం.

మళ్ళీ, ఇది అందరికీ పని చేయదు. అందరూ నియమాలను వంచడానికి ఇష్టపడరు. ఇది కేవలం సలహాలు- అతని నీతులుకు ఒక ఉపోద్ఘాతం మాత్రమే.