
చెట్లు నాటడంలో కొత్త సహకారి
Last updated: April 8, 2025
Report this blog
డిసెంబరు ౨౦౨౨ నవీకరణ: మా సైట్లో నాటిన చెట్ల సంఖ్య నిరంతరంగా నవీకరించడం ఇంక చెయ్యం. మా దానాలు ఇచ్చేటప్పుడు సంఖ్య నవీకరణ జరుగుతుంది, అంటే సుమారు ప్రతి సంవత్సరం. ఇప్పటి వరకు, మా దానాలవలన Trees for the Future ౫,౦౦,౮౪౦ చెట్లు నాటారు, అలాగే Arbor Day Foundation ౧౫,౦౭౮ నాటారు.
--------------------
Trees for the Future తో ఇప్పుడు సహకారం ప్రారంబిస్తున్నామని గర్వంగా ప్రకటిస్తున్నాం. వాళ్ళ లక్ష్యం ఏమిటంటే ఆఫ్రికాలో ప్రజలకు పెరటి తోటలు నాటడానికి సహాయం ఇవ్వడం. ఈ పెరటి తోటలేమో బొగ్గుపులుసు వాయువు పీల్చుకోవడమే కాకుండా, వాటిని పెంచే రైతులకు అమూల్యమైన తిండినీ అడవి ఉత్పత్తలనూ అందిస్తాయి.
వాళ్ళ పద్ధతి గురించి ఇక్కడ చదవచ్చు, అలాగే మా స్పాన్సర్ పేజీ ఇక్కడ చూడచ్చు (రెండూ ఆంగ్లంలో ఉన్నాయి).
Trees for the Future ఆఫ్రికాలో స్థానిక రైతుల తో పనిచేస్తున్నందుకు మా ముందు సహకార సంస్థ కంటే వాళ్ళకు చెట్లు నాటడం చాలా తక్కువ ఖర్చు, అలాగే మేము నాటిన చెట్లు హటాత్తుగా చాలా ఎక్కువ అయ్యాయి.
ఇదివరకట్లాగానే, JetPunkలో మేము మా రెవెన్యూలో ౫% చెట్లు నాటడానికి దానంగా ఇవ్వాలని కట్టుబడున్నాం. దీన్ని సాధ్యంగా చేసినందుకు ఈ సైట్ వాడేవాళ్ళందరికి ధన్యవాదం.
జాగ్రత్తగా చూసుకో
హైకూ వ్రాయాలి
i tried to translate smth else: దేవుని మరలు మెల్లగా తిరుగుతాయి
but idk how to translate "but they grind exceeding small"
also how to write that other word
anyway how would u translate those two things?