తెలుగు JetPunk పరీక్షల పోటీ ఫలితాలు!
Last updated: December 9, 2024
Report this blog
పరీక్షల పోటీ
కొన్ని నెలల క్రితం తెలుగు JetPunk సంఘము ఒక పరీక్షల పోటీ ప్రకటించింది. ఈ మొదటి పోటీ కోసం "నీరు" అనే విషయం మీద పరీక్షలు చెయ్యమని చెప్పాము. ఆ నెల "నీరు" అనే విషయం మీద మన సభ్యులు అయిదు పరీక్షలు చేసారు.
ఈ సంఘంలో చాలా సభ్యులు ప్రధానంగా మన తెలుగు JetPunk Discord సర్వర్లో మాట్లాడుతారు, కాబట్టి భవిష్యత్తులో పోటీలలో, ఈ సంఘంలో సభ్యులతో ఇంకా మాట్లాడాలనుకున్నా, సర్వర్లో కలిస్తే ఇంకా సామర్థ్యంగా సరదాగా సంభాషించచ్చు.
ఈ ఫలితాల వ్యాసం మేము జూనులోనే చేయాల్సిందే, కానీ ఎందుకో ఏమో ఇంత ఆలస్యమయింది.
ఈ పోటీలో పరీక్షలు విలువపట్టుదానికి మూడు వ్యక్తులను అడిగాము: నేను (న్యోదిమము), ప్రకృతిదారం, ఇక సూరజ్రాక్స్.
మీకు ఫలితాలు చెప్పే ముందు, మన పోటీలో పరీక్షలు చుద్దాం!
పరీక్షలు
ప్రపంచ మహాసముద్రాలు
ఇది సూరజ్రాక్స్ గారి పరీక్ష. ఇది ఒక మామూల పరీక్ష, కానీ చాల ముఖ్యమైనది. ఈ పరీక్షలో మన ప్రపంచంలోని అయిదు సముద్రాల పేరులు వ్రాయాలి. పరీక్ష బాగుంది, అందులో సముద్రాల పేరులు కూడా బాగున్నాయి.
భారతదేశంలో ౧౦ (పది) అతిపెద్ద నదులు
ఇది న్యోదిమము గారి (నా) పరీక్ష. చాలా తెలుగు పరీక్షలు లగే, ఈ పరీక్ష కూడా భారతదేశం గురించి. ఈ పరీక్షలో భారతదేశంలో అతిపెద్ద నదులు పేరులు వ్రాయాలి.
గోదావరా కృష్ణా?
ఇది ప్రకృతిదారం గారి పరీక్ష. ఈ పరీక్షలో వాక్యాలు కృష్ణా నదిని వర్ణిస్తాయా, గోదావరి నదిని వర్ణిస్తాయా, లేకపోతే రెండిటిని అని చెప్పాలి. సృజనాత్మక వాక్యాలు ఉన్నాయి.
ఏడు అరబ్బీ సముద్రాలు
ఇది నోయివర్న్ గారి పరీక్ష. ఈ పరీక్షలో ఏడు అరబ్బీ సముద్రాలు చెప్పాలి. సృజనాత్మక వాక్యాలు ఉన్నాయి. సముద్రాల పేరులు బాగున్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళాలు
ఇది సూరజ్రాక్స్ గారి పరీక్ష. ఈ పరీక్షలో ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళాలు ఉన్న దేశాలు చెప్పాలి. పరిశోధన బాగా చేసారు.
ఫలితాలు
ఈ పోటీలో పరీక్షలు విలువపట్టుదానికి మూడు వ్యక్తులను అడిగాము: నేను (న్యోదిమము), ప్రకృతిదారం, ఇక సూరజ్రాక్స్. మొదటిగా తక్కువు మార్కులు ఉన్న పరీక్షా చూడడము, చివరిగా గెలిసిన పరీక్షా చూడడము.
ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 49.70 ఇచ్చారు, న్యోదిమము గారు 62.10 ఇచ్చారు (పక్షపాతమా?), ఇక సూరజ్రాక్స్ గారు 59.70 ఇచ్చారు.
మొత్తంగా 57.17 మార్కులుతో, చివరి స్థానములో...
అవును, నాదే తక్కువు వచ్చింది
ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 59.70 ఇచ్చారు, న్యోదిమము గారు 72.40 ఇచ్చారు, ఇక సూరజ్రాక్స్ గారు 65.60 ఇచ్చారు.
మొత్తంగా 65.90 మార్కులుతో, నాలుగవ స్థానములో...
ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 75.00 ఇచ్చారు, న్యోదిమము గారు 88.40 ఇచ్చారు, ఇక సూరజ్రాక్స్ గారు 76.80 ఇచ్చారు.
మొత్తంగా 80.07 మార్కులుతో, మూడవ స్థానములో...
ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 90.80 ఇచ్చారు (పక్షపాతమా?), న్యోదిమము గారు 83.20 ఇచ్చారు, ఇక సూరజ్రాక్స్ గారు 78.90 ఇచ్చారు.
మొత్తంగా 80.07 మార్కులుతో, రెండవ స్థానములో...
ప్రకృతిదారం గారి గోదావరా కృష్ణా?!
ఈ పరీక్షకి ప్రకృతిదారం గారు 94.50 ఇచ్చారు, న్యోదిమము గారు 85.80 ఇచ్చారు, ఇక సూరజ్రాక్స్ గారు 84.50 ఇచ్చారు.
మొత్తంగా 88.27 మార్కులుతో, గెల్సిన పరీక్ష...
నోయివర్న్ గారి ఏడు అరబ్బీ సముద్రాలు!!!
సారాంశం
పోటీదారులు, ఇక మన న్యాయమూర్తులకు కృతజ్ఞలం. చదవిందనుకు ధన్యవాదాలు!
- న్యోదిమము