అన్ని తెలుగు అక్షరాలుతో ఒక కథ
Last updated: April 18, 2025
Report this blog
కథ
"నీకు నిజంగా తెలుగు తెలుస్తే, అన్ని తెలుగు అక్షరాలుతో ఒక కథ వ్రాయి. ఆ అక్షరాలు దీర్ఘాలైన, వత్తులైన పరవాలేదు." అని ఒక శిష్యుడు అంతఃకరణ శుద్ధితో అన్నాడు.
ఇది విని, వెంటనే గురువు కాగితం తీసాడు. కానీ వ్రాసే ముందు, పాఠశాల కిటికీ నుండి గురువుకి చాలా మబ్బులు కనపడాయి. వర్షం పడుతుంది అని గురువు లెగిసి, కిటికీలు మూసాడు. ఛాయలో వ్రాయలేడు అని ఒక దీపం జాగ్రత్తగా అంటించాడు. కానీ వ్రాయడానికి కూర్చుంటే ఝరి లాంటి శబ్దం కిటికీలనుండి వచ్చింది. అంత శబ్దంతో అతను జ్ఞాపకంలో ఉన్న పదాలు గుర్తించలేకపోయాడు. లెగిసి, అతను శిష్యులతో వేరే గదికి వెళ్ళాడు. కానీ ఆ గదిలో ఒక గురువు లాభాలు గురించి నేర్పుతుంది. ఇంకో గదికి వెళ్ళితే, చిన్న పిల్లలు గుఱ్ఱాలు, ఖడ్గమృగాలు లాంటి జంతువులు గురించి నేర్చుకుంటున్నారు. చివరిగా ఒక ఖాళీ గది కనపడింది. అంత సేపు నడిచారు అని ముందు ఫలూడా తాగారు. కానీ ఆ హడావిడిలో కలం మర్చిపోయాడు! కానీ మళ్ళీ మొదటి గదికి త్వరగా ఎల్లాలంటే వానలో నడవాల్సిందే!
గురువు ధైర్యంగా, ఒక పుస్తకాన్ని ఢాలములాగా వాడి, వానలో పరిగెత్తి కలం తీసుకొచ్చాడు. కూర్చొని చాలా సేపు వ్రాసాడు. కానీ శిషుడుకి ఒక తప్పు కనపడింది.
"ఈ వాఙ్మయంలో ఙ లేదు!"
సవర్ణదీర్ఘ సంధి 🤓
నేను అది వ్రాసే ముందే సంధి గురించి చదివాను!!!అకారసంధిలో "అమ్మంటే" లాగా వ్రాసాను.